epaper
Sunday, February 22, 2026
epaper

మన పార్టీల్లో మాయమైన తెలంగాణం!

కలం, తెలంగాణ బ్యూరో : తెలంగాణ.. ఒక అస్తిత్వం, ఒక ఆకాంక్ష, ఒక ఆత్మగౌరవం. అంతేకాదు.. ఒక అనుబంధం, ఒక ఎమోషన్, ఒక సెంటిమెంట్. సరిగ్గా రాజకీయ పార్టీలకు (Telangana Regional Parties) ఇదే అస్త్రమైంది. పార్టీ పేరులో తెలంగాణ పదాన్ని పెట్టుకున్నాయి. నాడు మర్రి చెన్నారెడ్డి పెట్టిన తెలంగాణ ప్రజా సమితి మొదలు.. తెలంగాణ సాధన సమితి, తెలంగాణ పార్టీ, జై తెలంగాణ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, తల్లి తెలంగాణ, నవ తెలంగాణ ప్రజా పార్టీ, తెలంగాణ నగారా సమితి, తెలంగాణ ఇంటి పార్టీ, యువ తెలంగాణ పార్టీ, తెలంగాణ జన సమితి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ .. వీటన్నింటికీ ఆ పదమే ఆత్మగా మారింది. కాలక్రమంలో కొన్ని వేరే పార్టీల్లో విలీనమయ్యాయి. మరికొన్ని అంతర్ధానమయ్యాయి. ఆ పేరుతో ఇప్పుడు మిగిలింది టీజేఎస్, టీఆర్‌‌పీ మాత్రమే! తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే పుట్టిన టీఆర్‌‌ఎస్ ‘తెలంగాణ’ను తొలగించి ‘భారత్’ పెట్టుకున్నది. టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ అయింది. ‘ఓడ దాటే దాకా..’ చందంగా కేసీఆర్ తన అవసరం తీరాక ‘తెలంగాణ ఆత్మ’నే వదిలేశారన్న విమర్శలు ఎదుర్కొన్నారు.

పార్టీ పేరు మార్చుకున్న ఏడాదిన్నరకే కేసీఆర్ అధికారం కోల్పోయారు. అదే.. జార్ఖండ్ రాష్ట్ర సాధన కోసమే పుట్టిన జార్ఖండ్ ముక్తి మోర్చా పాతికేళ్లు దాటినా పార్టీ పేరును మాత్రం మార్చుకోలేదు. అక్కడ స్వరాష్ట్రంలో ఇప్పటికీ ఆ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు కల్వకుంట్ల కవిత పెట్టుకునే కొత్త పార్టీకి కూడా ‘తెలంగాణ’ పదమే దిక్కయింది. ఆమెకు తండ్రి ఆదర్శమవుతారా?.. లేక జేఎంఎం స్ఫూర్తిగా ఉంటుందా?.. కాలమే తేలుస్తుంది.

‘తెలంగాణ’ పార్టీలపై కలం 360 డిగ్రీస్ కథనం చదివేందుకు కింద ఉన్న పేపర్ ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Telangana Regional Parties
Telangana Regional Parties

Read Also: పైసల మంత్రికి మరో క్యాంప్ ఆఫీస్‌.. ఏకంగా నాలుగున్నర కోట్లు..

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>