ఉగ్రదాడి బెదిరింపు.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్​ డెస్క్​: హైదరాబాద్​ లో ఉగ్రదాడి జరుగుతుందంటూ వచ్చిన బాంబు బెదిరింపులపై (Hyderabad Bomb Threats) గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​ (MLA Raja Singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ బ్లాస్ట్​ బెదిరింపులను తెలంగాణ ప్రభుత్వం తేలికగా తీసుకోవద్దని సోషల్​ మీడియాలో ఓ వీడియో ద్వారా కోరారు. సీఎం రేవంత్​ రెడ్డి, డీజీపీ, ఇంటెలిజెన్స్​ విభాగం దృష్టి సారించాలన్నారు. 26/11 తరహా దాడి చేసేందుకు హైదరాబాద్ లో ఉన్న స్లీపర్​ సెల్స్​ పాకిస్తాన్​ టెర్రరిస్టులకు సహాయం చేస్తారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

పాతబస్తిలో ఎక్కువ సంఖ్యలో స్లీపర్​ సెల్స్​ ఉన్నారని రాజాసింగ్​ ఆరోపించారు. 1993లో ముంబైలో జరిగిన దాడుల మాదిరిగానే హిందువులే టార్గెట్​ గా ఈ పేలుళ్లకు ప్లాన్​ చేశారని ఆయన తెలిపారు. హైదరాబాద్ లో హిందువులు ఎక్కువ సంఖ్యలో ఎక్కడ ఉంటారో ఆ ప్రాంతాలను మొదట గుర్తించి అక్కడ పేలుళ్లకు ప్రణాళిక​ చేస్తారని చెప్పారు. ఎక్కడ బ్లాస్ట్​ చేస్తే ఎక్కువ మంది హిందువులు చనిపోతారో టెర్రరిస్టులకు ఇక్కడ ఉన్న స్లీపర్​ సెల్స్​ సమాచారం అందిస్తారని వ్యాఖ్యానించారు. బాంబు దాడి బెదిరింపులపై (Hyderabad Bomb Threats) పోలీసులు, ప్రభుత్వం విచారణ చేపట్టి వార్నింగ్ మెయిల్​ పంపిన వాళ్లను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని రాజాసింగ్​ కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>