పూరీ జగన్నాధ్‌లా డైలాగ్స్ ఎవరూ రాయలేరు : ప్రభాస్

కలం, సినిమా : యంగ్ హీరో సంతోష్ శోభన్(Santosh Sobhan), క్యూట్ బ్యూటీ మానసా వారణాసి(Manasa Varanasi) జంటగా నటించిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ “కపుల్ ఫ్రెండ్లీ”(Couple Friendly) మూవీ రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మూవీ టీం డార్లింగ్ ప్రభాస్ (Prabhas) తో స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొనింది. మూవీ సక్సెస్ అయినందుకు ప్రభాస్ స్పెషల్ కంగ్రాట్స్ తెలిపారు. అలాగే మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ స్పెషల్ చిట్‌చాట్‌లో భాగంగా  స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్‌ (Puri Jagannadh)ను ప్రభాస్ ప్రశంసించారు. పూరీ గారిలా ఎవరు డైలాగ్స్ రాయలేరు. బుజ్జిగాడు మూవీ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు పిచ్చెక్కిపోయింది. ఎలా చేయాలా అని టెన్షన్ పడ్డాను. ఆ సమయంలో ఎవరితో మాట్లాడిన బుజ్జిగాడిలా మాట్లాడేవాడిని.. అంతలా ఆ క్యారెక్టర్ నాకు తెగ నచ్చేసింది. ఆ రేంజ్ క్యారెక్టర్ డిజైన్ చేయడం ఎవరి వల్ల కాదు. పూరీ గారిలా  డిఫరెంట్ గా థింక్ చేసే వ్యక్తి బహుశా ఎక్కడా ఉండరని ప్రభాస్ అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>