ప్రజా ఫిర్యాదులపై అధికారులకు ఎస్పీ కీలక ఆదేశాలు

కలం, భైంసా: ప్రజల నుంచి అందే ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల(Janaki Sharmila) ఆదేశించారు. గురువారం భైంసా పట్టణంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. భైంసా సబ్‌డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. కుటుంబ సమస్యలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై షీ టీం సిబ్బందితో ఇరు వర్గాలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. పరస్పర అవగాహనతో సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>