డ్రోన్‌తో గాల్లోకి మంచం.. వినూత్నంగా సర్పంచ్ అభ్యర్థి ప్రచారం!

కలం, వెబ్ డెస్క్: విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులో సర్పంచ్ ఎన్నికల ప్రచారం వినూత్న రీతిలో సాగింది. ప్రచారానికి చివరి రోజున సర్పంచ్ అభ్యర్థి కొల్లా ఆనందకుమార్(Anand Kumar) తన ఎన్నికల గుర్తు ‘మంచం’ను డ్రోన్‌కు కట్టి గాల్లో ఎగురవేస్తూ స్థానిక ఓటర్ల దృష్టిని ఆకర్షించారు. ఈ వినూత్న ప్రచారం గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

గతంలో ఉపసర్పంచ్‌గా పనిచేసిన సమయంలో గ్రామంలో 30 సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టినట్లు ఆనందకుమార్ తెలిపారు. ఈసారి అవకాశం కల్పిస్తే ఏలూరు కాలువపై వంతెన నిర్మాణం, తాగునీటి సమస్య పరిష్కారం, పారిశుధ్య మెరుగుదలతో పాటు గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డ్రోన్ ప్రచారంతో రామవరప్పాడు ఎన్నికల వాతావరణం మరింత ఆసక్తికరంగా మారింది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>