కలం, ముథోల్ : గ్రామాల భద్రతలో ప్రజల భాగస్వామ్యం కీలకమని జిల్లా ఎస్పీ జానకి షర్మిల (SP Janaki Sharmila) అన్నారు. నిర్మల్ పోలీస్.. మీ పోలీస్.. కార్యక్రమంలో భాగంగా ముథోల్ మండలం చింతకుంట(Chintakunta) గ్రామంలో ప్రజల సౌజన్యంతో ఏర్పాటు చేసిన 20 సీసీ కెమెరాలను బుధవారం ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గ్రామ భద్రత మనందరి బాధ్యత అనే భావనతో గ్రామ ప్రజలు ముందుకు వచ్చి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రజల సహకారం, పోలీసుల సమన్వయంతోనే గ్రామాల్లో సమగ్ర భద్రత సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, సీఐ దీపక్, ఎస్సైలు ప్రదీప్, పెర్సిస్, గ్రామ పెద్దలు, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు.

