పత్తి కొనుగోళ్లపై కలెక్టర్ భవేశ్ మిశ్రా ఫోకస్

కలం, నిర్మల్: పత్తి పంట కొనుగోలు (Cotton Crop Procurement) ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం నిర్మల్ జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పత్తి పంట కొనుగోలు ప్రక్రియపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఈ ఏడాది సాగు చేసిన పత్తి పంట వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పత్తి పంట కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు.

కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ నమోదు చేసుకొని రైతులు తమ పంటను విక్రయించుకోవచ్చని తెలిపారు. రైతులు ఎలాంటి నష్టానికి గురికాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేష్, ఆర్డీవో దేవీదాస్, సీసీఐ అధికారులు శరత్, వ్యవసాయ అధికారి సుజాత, జిల్లా మార్కెటింగ్ అధికారి గంగు, వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్లు భీమ్ రెడ్డి, షిండే ఆనంద్ రావు పటేల్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>