ప్రజా ఫిర్యాదులపై తక్షణ స్పందన: ఎస్పీ అఖిల్ మహాజన్

కలం, నిర్మల్: ఆదిలాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ (SP Akhil Mahajan) ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్‌ లో మాట్లాడిన ఎస్పీ ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని 8712659973 నంబర్‌కు వాట్సాప్ ద్వారా తెలియజేయాలని సూచించారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>