కుంటాలకు తెలంగాణ పబ్లిక్ స్కూల్.. రూ.9 కోట్ల నిధులు మంజూరు

కలం, కుంటాల : కుంటాల మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌ (Kuntala Telangana Model School) ను అప్‌గ్రేడ్ చేసి తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ గా మార్చేందుకు ప్రభుత్వం జీవో జారీ చేసిందని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సోమవారం తెలిపారు. పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు ప్రభుత్వం రూ.9 కోట్ల నిధులు మంజూరు చేసిందని వెల్లడించారు. ఈ నిధులతో అదనపు తరగతి గదుల నిర్మాణంతో పాటు పాఠశాలలో మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలను మెరుగుపరచనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

తెలంగాణ పబ్లిక్ స్కూల్ (TPS) అందుబాటులోకి రావడంతో విద్యార్థులు ప్రాథమిక విద్య నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే పాఠశాలలో విద్యాభ్యాసం చేసే అవకాశం కలుగుతుందని తెలిపారు. కుంటాల మండలానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ (Kuntala Model School) మంజూరు చేసి రూ.9 కోట్ల నిధులు కేటాయించిన రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రభుత్వానికి ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (Pawar Rama Rao) ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

Also Read : శీతల్ దేవి ఫైనల్‌కు.. భారత్‌కు పతకం ఖాయం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>