కలం, కరీంనగర్: శ్రీ కృష్ణాష్టమి పర్వదిన వేడుకలను పురస్కరించుకుని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని (Karimnagar) అశోక్ నగర్ డివిజన్లో ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా, ఘనంగా కన్నుల పండుగగా నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ ఉమారాణి వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు డివిజన్ ప్రజలు, యూత్ క్లబ్ సభ్యులు పెద్దఎత్తున తరలివచ్చారు.
శ్రీకృష్ణ భగవానుడి బాల్య లీలలను స్మరించుకుంటూ నిర్వహించిన ఈ వేడుకల్లో యువకులు, చిన్నారులు అత్యుత్సాహంతో పాల్గొన్నారు. సంప్రదాయబద్ధంగా ఏర్పాటు చేసిన ఉట్టిని కొట్టేందుకు యువకులు పోటీపడగా, డివిజన్ మొత్తం శ్రీకృష్ణ నామస్మరణతో మార్మోగింది. ఈ కార్యక్రమం ద్వారా స్థానికులలో పండుగ వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ ఉమారాణి వెంకటరమణ (Uma Rani Venkataramana) మాట్లాడుతూ.. మన సాంస్కృతిక సంప్రదాయాలను, పండుగలను ఘనంగా నిర్వహించడం ద్వారా భావితరాలకు మన సంస్కృతిని అందించవచ్చని తెలిపారు. డివిజన్ ప్రజలందరూ సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని శ్రీకృష్ణుడిని ప్రార్థించినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ వేడుకలను విజయవంతం చేయడానికి సహకరించిన యూత్ క్లబ్ సభ్యులకు, డివిజన్ ప్రజలందరికీ ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

