కోల్‌కతా హోటల్‌లో అగ్నిప్రమాదం.. చిన్నారితో సహా 9 మంది మృతి!

కలం, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా‌లో బుధవారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నగరంలోని ఓ హోటల్‌ (Kolkata Hote Fire) లో హఠాత్తుగా సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో ఒక చిన్నారితో సహా కనీసం తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజామున సుమారు 2:00 గంటల ప్రాంతంలో అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది.

హోటల్ గదుల్లోంచి ఒక్కసారిగా పొగ, మంటలు వ్యాపించడంతో అందులోని వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదంపై సమచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. భవనంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావడానికి తీవ్రంగా శ్రమించారు. ఈ ప్రమాదానికి ఎయిర్ కండీషనర్ (AC) పేలడమే ప్రధాన కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ విషాదకర సంఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>