Mobile Popup Ad
Mobile Popup Ad

భారత్ మ్యాచ్ రద్దుతో వేల కోట్ల దెబ్బ

కలం, వెబ్ డెస్క్:  టీ20 వరల్డ్ కప్ 2026లో (India Pakistan T20)  భారత్‌తో మ్యాచ్‌కు పాకిస్థాన్ దూరంగా ఉండటం క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. ఈ తాజా నిర్ణయం వల్ల అంతర్జాతీయ క్రికెట్ వాణిజ్య రంగంలో భారీ నష్టాలు తప్పవన్న అంచనాలు వెలువడుతున్నాయి. కొన్ని వారాల అనిశ్చితి తర్వాత పాకిస్థాన్ ప్రభుత్వం జట్టుకు టోర్నీలో పాల్గొనే అనుమతి ఇచ్చింది. అయితే ఫిబ్రవరి 15న భారత్‌తో జరిగే కీలక మ్యాచ్‌లో ఆడవద్దని ఆదేశించింది. దీంతో ఆ మ్యాచ్ ఫోర్ఫీట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది.

ఈ నిర్ణయంతో ముందుగా ప్రభావితమయ్యేది బ్రాడ్‌కాస్టర్లేనని నివేదికలు చెబుతున్నాయి. భారత్–పాకిస్థాన్ మధ్య జరిగే ఒక్క టీ20 మ్యాచ్ (India Pakistan T20) వాణిజ్య విలువ సుమారు 500 మిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది. ఇందులో ప్రసార హక్కులు, ప్రకటనలు, స్పాన్సర్ ఒప్పందాలు, టికెట్ల ఆదాయం ఉన్నాయి. ఈ మ్యాచ్ సమయంలో 10 సెకన్ల ప్రకటనకు రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ధర ఉండేదని సమాచారం. ఇది ఇతర మ్యాచ్‌ల కంటే ఎక్కువగా ఉంటుందని వెల్లడైంది.

అధికారిక ప్రసార హక్కులు కలిగిన సంస్థకు భారత్, పాకిస్థాన్ మార్కెట్ల నుంచి మాత్రమే సుమారు రూ.300 కోట్ల ప్రకటన ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా. బీసీసీఐకి తక్షణంగా దాదాపు రూ.200 కోట్ల నష్టం వచ్చే సూచనలు ఉన్నాయి. ఈ అంశంపై మాజీ పాకిస్థాన్ వికెట్ కీపర్ రషీద్ లతీఫ్ స్పందించారు. ప్రపంచకప్‌ను ఎక్కువ మంది భారత్–పాకిస్థాన్ మ్యాచ్‌ల కోసమే చూస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ స్థాయి మార్కెట్ దెబ్బతింటే ప్రభావం ఒక్క దేశానికే పరిమితం కాదని తెలిపారు. ఈ నిర్ణయం భారత్, బీసీసీఐ, ఐసీసీతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి దేశాలకూ ఆర్థికంగా ప్రభావం చూపుతుందని విశ్లేషణలు సూచిస్తున్నాయి. ఒక మ్యాచ్ రద్దు ప్రభావం ప్రపంచ క్రికెట్ వ్యవస్థపై పడే పరిస్థితి నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>