కుప్పకూలిన గోల్డ్ మైన్.. 30 మంది దుర్మరణం!

కలం, వెబ్ డెస్క్ : సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ లో భారీ విషాదం చోటుచేసుకుంది. పశ్చిమ ప్రాంతంలోని నానా-మాంబేరే ప్రిఫెక్చర్ పరిధిలోని అబ్బా ప్రాంతంలో ఉన్న ఒక బంగారు గని ఒక్కసారిగా కుప్పకూలిపోయింది (Gold Mine Collapse). ఈ ఘోర ప్రమాదంలో కనీసం 30 మంది కార్మికులు మృతి చెందగా, పలువురు గల్లంతయ్యారు. ఘటన సమయంలో గనిలో పనిచేస్తున్న మహిళలు, చిన్నారులు సైతం మట్టిదిబ్బల కిందే కూరుకుపోయినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, అధికారులు సహాయక చర్యలు ప్రారంభించి 30 మృతదేహాలను బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన మరికొందరిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద స్థలంలో శిథిలాల కింద ఇంకా కొందరు చిక్కుకుని ఉండటంతో ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే సమయం గడుస్తున్న కొద్దీ వారిని ప్రాణాలతో బయటకు తీసే అవకాశాలు క్షీణిస్తున్నాయని రెస్క్యూ బృందాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

స్థానికంగా సాంప్రదాయ పద్ధతుల్లో సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా తవ్వకాలు జరపడమే ఈ దుర్ఘటనకు ప్రధాన కారణమని తెలుస్తోంది. కాగా, గనిలో ఇంకా ఎంతమంది చిక్కుకున్నారో కచ్చితమైన సమాచారం లేకపోవడంతో సహాయక చర్యల కోసం అంతర్జాతీయ సంస్థలు, సహాయక బృందాలు ముందుకు రావాలని స్థానిక అధికారులు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>