కలం, వెబ్ డెస్క్: సమాజానికి మార్గనిర్దేశం చేయాల్సిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ దారి తప్పి ప్రవర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేరళకు (Kerala) చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, మోటివేషనల్ స్పీకర్ నిషా రాఫెల్ 11 ఏళ్ల బాలుడ్ని లైంగికంగా వేధించినట్లు ఆరోపణలొచ్చాయి. అయితే బాలుడిని త్రిసూర్ జనరల్ ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా.. అతనిపై లైంగిక వేధింపులు జరిగినట్లు నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది.
దీంతో నిషా రాఫెల్‌పై త్రిసూర్ వెస్ట్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే ఇది తప్పుడు కేసు అని.. నిషా ప్రతిష్టను దిగజార్చేందుకే ఈ కేసు పెట్టారని ఆమె సన్నిహిత వర్గాలు వాదిస్తున్నాయి. రెండు ఫ్లాట్ల విషయంలో నిషాకు, ఫిర్యాదుదారుకు మధ్య వివాదం ఉందని.. అదే ఈ కేసుకి దారి తీసిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. నిషాపై వచ్చిన లైంగిక ఆరోపణల వ్యవహారంలో అధికారులు సమగ్ర విచారణ దిగారు.

