ఎలన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు.. రాహుల్ రిప్లై!

కలం, వెబ్ డెస్క్: ఎలన్ మస్క్ (Elon Musk) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో స్టార్ లింక్‌కు లైసెన్స్ రాకుండా గుత్తాధిపత్య శక్తులు అడ్డుకుంటున్నాయంటూ బుధవారం ఎక్స్‌లో పేర్కొన్న ఆయన శుక్రవారం నేరుగా అంబానీ పేరుతో మరో పోస్ట్ చేశారు. “స్టార్‌లింక్ 165కి పైగా దేశాల్లో లైసెన్స్ పొంది సేవలు అందిస్తోంది. భారత ప్రభుత్వం నిర్దేశించిన ప్రతి చట్టం, ప్రతి నిబంధనకు కట్టుబడి ఉంటామని గత ఐదేళ్లుగా కృషి చేస్తూనే ఉంది. అలాంటప్పుడు ఇంకా లైసెన్స్ ఎందుకు రాలేదు? భారతదేశానికి అంబానీనే అసలైన నాయకుడా?” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టార్ లింక్‌ను వ్యతిరేకించేవారు ఇంటర్నెట్ సేవలు సరిగా అందని వర్గాలకే నష్టం కలిగిస్తున్నారని మస్క్ ధ్వజమెత్తారు. ధనవంతులకు లేదా పెద్ద నగరాల్లో నివసించేవారికి ఇప్పటికే మంచి ఇంటర్నెట్ సదుపాయం ఉంది కాబట్టి వారికి ఈ విషయం అర్థం కాదు” అంటూ పోస్ట్ చేశారు.

రాహుల్ గాంధీ ఏమన్నారంటే..

ఎలన్ మస్క్ చేసిన పోస్టుకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ రిప్లై ఇచ్చారు. “ఎలన్.. భారతదేశానికి స్వాగతం. ఆ మరో వ్యక్తిని కనుగొనే వరకు వెయిట్ చేయండి” అని పోస్ట్ చేశారు. రాహుల్ పోస్టుకు ఎలన్ మస్క్ రిప్లై ఇస్తూ.. “ధన్యవాదాలు రాహుల్, నిజంగా ఇది ఇబ్బందిగా ఉంది” అని తెలిపారు. స్టార్ లింక్ లైసెన్స్‌పై ఎలన్ మస్క్ చేసిన వ్యాఖ్యలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఖండించింది. వినియోగదారుల డేటా భద్రతకు భారత ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని.. స్టార్ లింక్ సేవలకు సంబంధించిన భద్రతా ప్రక్రియ ఇంకా పరిశీలనలో ఉందని వెల్లడించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>