Mobile Popup Ad
Mobile Popup Ad

ఓటరు జాబితాలో మాజీ కేంద్రమంత్రి పేరు గల్లంతు: విచారణకు ఆదేశం!

కలం, వెబ్ డెస్క్ : అమేథీ జిల్లాలోని గౌరీగంజ్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మేదన్ మావై గ్రామం ఓటర్ల జాబితా నుంచి బీజేపీ సీనియర్ నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) పేరు గల్లంతు స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితాలో ఆమె పేరు ఉన్నప్పటికీ, ఇటీవల విడుదలైన పంచాయతీ ఓటర్ల జాబితాలో మాత్రం ఆమె పేరు కనిపించకపోవడం గమనార్హం.

జూన్ 10న అధికారికంగా ప్రచురించిన పంచాయతీ ఓటర్ల జాబితాతో ఈ లోపం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై అమేథి జిల్లా మేజిస్ట్రేట్ సంజయ్ చౌహాన్ స్పందిస్తూ, దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు శుక్రవారం వెల్లడించారు. విచారణ నివేదిక అందిన తర్వాతే పేరు తొలగిపోవడానికి గల అసలు కారణాలు తెలుస్తాయని ఆయన స్పష్టం చేశారు.

స్మృతి ఇరానీ 2019 నుండి 2024 వరకు అమేథి నియోజకవర్గానికి లోక్‌సభ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆమె గౌరీగంజ్ అసెంబ్లీ పరిధిలోని మేదన్ మావై గ్రామంలో సొంత నివాసాన్ని నిర్మించుకున్నారు. అక్కడే ఓటరుగా నమోదై, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ అభ్యర్థి కిషోరీ లాల్ శర్మ చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

ఈ వ్యవహారంపై బీజేపీ అమేథి జిల్లా అధ్యక్షుడు సుధాంశు శుక్లా మాట్లాడుతూ, పంచాయతీ ఓటర్ల జాబితాలో స్మృతి ఇరానీ (Smriti Irani) పేరును తిరిగి చేర్చాలని కోరుతూ ఇప్పటికే దరఖాస్తు సమర్పించామని తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లామని, నిబంధనల ప్రకారం తగిన పరిశీలన పూర్తి చేసి ఆమె పేరును తిరిగి జాబితాలో చేర్చుతామని అధికారులు హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.

Read Also: ‘అఖండ కాంగ్రెస్’ అవతరించబోతుందా?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>