Mobile Popup Ad
Mobile Popup Ad

అమెరికాలో ఫిఫా ఫీవర్ మిస్సింగ్

కలం, వెబ్ డెస్క్: ఫుట్ బాల్ వరల్డ్ కప్ (FIFA World Cup)కు కెనడా, మెక్సికోలతో కలిసి ఆతిథ్యం ఇస్తున్న అమెరికాలో ఈసారి టూరిజం, ట్రావెల్ ఇండస్ట్రీ భారీగా లాభపడుతుందని ఆశించినప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ రాక తగ్గడం, ఫ్లైట్ టికెట్ల ధరలు పెరగడం, కఠినమైన వీసా నిబంధనలే ఇందుకు కారణం. అమెరికాలో సాకర్ ఆటకు క్రేజ్ తక్కువగా ఉండటంతో లోకల్ ఫ్యాన్స్ కూడా ఈ లోటును పూడ్చలేకపోతున్నారు.

యూరప్ నుంచి ఫ్లైట్ బుకింగ్స్ 3.8 శాతం తగ్గగా, జులై 19న ఫైనల్ జరగనున్న న్యూయార్క్ సిటీకి ఏకంగా 15.8 శాతం పడిపోయాయి. న్యూయార్క్ హోటల్ అసోసియేషన్ తమ వరల్డ్ కప్ ఆదాయ అంచనాలను 60 శాతం తగ్గించుకుని 60 మిలియన్ డాలర్లకు పరిమితం చేసింది. 12 లక్షల మంది వస్తారనుకుంటే 5 లక్షల మందే వస్తుండటంతో హిల్టన్ మిడ్టౌన్ వంటి పెద్ద హోటళ్లు తమ రూమ్ రెంట్లను సగానికి తగ్గించి 415 డాలర్లుగా నిర్ణయించాయి.

టికెట్ షాక్.. హోం‌స్టేట్‌లకు డిమాండ్

మ్యాచ్ టికెట్ల ధరలు ‘డైనమిక్ ప్రైసింగ్’ విధానం వల్ల ఆకాశాన్ని తాకాయి, న్యూయార్క్, మియామి నగరాల్లో కనీస టికెట్ ధర 1,000 డాలర్ల వరకు ఉంది. దీనికి తోడు క్వాలిఫై అయిన దేశాలలో సగానికి పైగా దేశాల ఫ్యాన్స్ కు వీసాలు తప్పనిసరి అవ్వడం మరో అడ్డంకిగా మారింది. ఉగ్రవాద సంబంధాల ఆరోపణలతో ఒక సోమాలియా రిఫరీకి ట్రంప్ ప్రభుత్వం వీసా నిరాకరించడం గమనార్హం.

హోటళ్ల పరిస్థితి ఇలా ఉంటే, గ్రూపులుగా వచ్చే ఫ్యాన్స్ ఖర్చులు పంచుకోవడానికి తక్కువ బడ్జెట్ హోంస్టేట్‌లను బుక్ చేసుకుంటుండటంతో వాటి డిమాండ్ పెరిగింది. ముందుగా బుక్ చేసుకున్న వారికి రూమ్ రెంట్లు సగటున 218 డాలర్లు పడగా, ఇప్పుడు లాస్ట్ మినిట్ లో బుక్ చేసుకునే వారికి 335 డాలర్ల వరకు పలుకుతున్నాయి.

Read Also: మీనాక్షి కోసం త్యాగం చేసే ఆ ‘ఒక్కరు’ ఎవరు?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>