Mobile Popup Ad
Mobile Popup Ad

20 ఏళ్లకే మోకాళ్ల నొప్పులా?.. యువత చేస్తున్న ఈ తప్పే కారణమట!

కలం, వెబ్‌డెస్క్: చిన్న వయసులోనే మోకాళ్ల నొప్పులు, వెన్నెముక సమస్యలు (Orthopedic Issues) రావడం అనేది ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్య. ఒకప్పుడు కేవలం వృద్ధులలో మాత్రమే కనిపించే ఈ నొప్పులు, నేడు 20 నుండి 30 ఏళ్ల యువతను కూడా వేధిస్తున్నాయి. ఆధునిక జీవనశైలి మార్పుల వల్ల వయసుతో సంబంధం లేకుండా కీళ్ల నొప్పులు, నడుము నొప్పి, వెన్నునొప్పి సర్వసాధారణంగా మారిపోయాయి. గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవడం, శారీరక శ్రమ లేకపోవడం, పోషకాహార లోపం దీనికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

ఈ సమస్య గురించి షెల్బీ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు, ప్రముఖ మోకాలి మార్పిడి నిపుణుడు డాక్టర్ విక్రమ్ షా మాట్లాడారు. యువతలో పెరుగుతున్న ఎముకల సమస్యలకు ప్రధాన కారణం నిశ్చల జీవనశైలి (Sedentary Lifestyle) అని తెలిపారు. గంటలు తరబడి మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, కంప్యూటర్‌లను ఉపయోగించడం, సరైన భంగిమలో కూర్చోకపోవడం, వ్యాయామం చేయకపోవడం వల్ల నడుము, మెడ, మోకాళ్ల సమస్యలు వస్తున్నాయని తెలిపారు. ఈ లక్షణాలను చాలా మంది చిన్న సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేస్తారని, సకాలంలో చికిత్స తీసుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఆరోగ్య సమస్యలుగా మారే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

నివారణ మార్గాలు

మన జీవన శైలిలో కొన్ని మార్పులు చేయడం ద్వారా ఈ సమస్యల నుంచి బయటపడవచ్చని సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన బరువును మెంటైన్ చేయడం, ప్రతిరోజూ శారీరకంగా చురుకుగా ఉండడం, సమయానికి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా అనేక ఆర్థోపెడిక్ సమస్యల (Orthopedic Issues) నుంచి బయటపడవచ్చని తెలిపారు. ముఖ్యంగా యువత ప్రతిరోజూ స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం, సరైన భంగిమలో కూర్చోవడం, ఎక్కువసేపు ఒకే చోట కూర్చోకుండా మధ్య మధ్యలో నడవడం వంటి అలవాట్లు పెంచుకోవాలని, లేదంటే ఈ సమస్యల బారిన పడక తప్పదని హెచ్చరించారు.

Read Also: అరటిపండ్లు అందరికీ సేఫ్ కాదు.. ఎవరు తినకూడదో తెలుసా?

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>