కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎస్కేఎం నిరసన

కలం, నిర్మల్ : రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీల హక్కులను కాపాడాలని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. దేశవ్యాప్త పిలుపులో భాగంగా గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన (SKM Protest) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారత రాజ్యాంగ పరిరక్షణకు పోరాడాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఎస్కేఎం నాయకుడు నందిరామయ్య మాట్లాడుతూ.. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాడి వాటిని వెనక్కి తీసుకునేలా చేశారని, ప్రస్తుతం కేంద్రం రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని విమర్శించారు. ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడం, నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం కార్మికులకు నష్టం కలిగిస్తోందన్నారు. రైతులకు గిట్టుబాటు ధరల చట్టం చేయాలని, కార్మికులకు కనీస వేతనం రూ.42 వేలు, కనీస పెన్షన్ రూ.21 వేలు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నూతన్ కుమార్, రాజు, రాజన్న, రామలక్ష్మణ్, హరిత, రమేష్, సురేష్, తొడసం శంభు, పుండలిక్, నగేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>