కలం, మెదక్ బ్యూరో: వినాయక నిమజ్జనంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సంగారెడ్డి (Sangareddy) జిల్లా పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని పెద్దకంజర్ల గ్రామంలోని నేరేడు చెరువులో పడి ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు. శివ నగర్ శిరీష ఛారిటబుల్ ట్రస్ట్‌లో చదువుకుంటున్న తొమ్మిది మంది విద్యార్థులు గణేశుడి విగ్రహాన్ని ఎత్తుకొని నిమజ్జనం చేయడానికి నేరేడు చెరువులోకి దిగారు. చెరువులో లోతైన గుంతలు ఉండటం, విగ్రహం బరువు ఎక్కువ కావడంతో పాటు విద్యార్థులకు ఈత రాకపోవడంతో ఒక్కసారిగా లోతుల్లోకి జారిపోయారు. దీంతో ఆరు మంది విద్యార్థులు నీటిలో మునిగి అక్కడికక్కడే మృతి చెందారు.
మృతులు నర్సింహా రాజు: (బీటెక్), సుమంత్: (డిప్లమా 2nd ఇయర్), గణేష్: డిప్లమా (2nd ఇయర్), ఉదయ్ కిరణ్: (డిప్లమా 3rd ఇయర్), శాముకుమార్ (డిప్లమా 1st ఇయర్), సిద్ధార్థ్( 10వ తరగతి) గా గుర్తించారు. సమాచారం అందుకున్న పఠాన్ చెరు పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఒకేసారి ఆరు మంది విద్యార్థులు మృతి చెందడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.
Also Read : రోహిత్ రికార్డు బద్దలు.. టాప్‌లోకి బట్లర్!
Follow Us On: X(Twitter)

