‘మిషన్ ఇంద్రధనుష్’ చిన్నారుల పాలిట సంజీవని: కృష్ణారెడ్డి

కలం, కరీంనగర్: చిన్నారులను ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా కాపాడేందుకు ప్రధాని మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మిషన్ ఇంద్రధనుష్’ భావితరాల పాలిట సంజీవని అని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి (Singireddy Krishnareddy) కొనియాడారు. రాగంపేట అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా నిర్వహించిన ‘అంగన్‌వాడీ మిలన్’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

‘తల్లీబిడ్డ బాగుంటేనే.. భారతదేశం బాగుంటుంది’ అనే దృఢ సంకల్పంతో పనిచేస్తున్న ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ అని సింగిరెడ్డి కృష్ణారెడ్డి కొనియాడారు. అందుకే గత దశాబ్ద కాలంగా మాతా-శిశు సంక్షేమానికి బడ్జెట్‌లో రికార్డు స్థాయి నిధులు కేటాయిస్తూ అండగా నిలిచారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మోడీ ప్రభుత్వ పథకాలను ప్రస్తావించారు.

సింగిరెడ్డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘మిషన్ ఇంద్రధనుష్’ తో మారుమూల పల్లెలు, గిరిజన తండాల్లోనూ డిఫ్తీరియా, పోలియో, ధనుర్వాతం, తట్టు సహా 12 ప్రాణాంతక వ్యాధులకు ఉచితంగా వ్యాక్సిన్లు వేస్తున్నారని తెలిపారు. ప్రతి చిన్నారికి, గర్భిణీకి సంపూర్ణ వ్యాక్సినేషన్ అందిస్తూ దేశంలో శిశు మరణాల రేటును (IMR) అపూర్వంగా తగ్గించిన ఘనత మోడీ సర్కార్‌దేనన్నారు. అంగన్‌వాడీలను సమగ్ర వికాస వేదికలుగా తీర్చిదిద్ది తాగునీరు, విద్యుత్, ఆధునిక ప్రీ-స్కూల్ సామగ్రి అందించారని తెలిపారు. స్మార్ట్‌ఫోన్ లో డేటా రోజు తీసుకుంటూ ‘పోషణ్ ట్రాకర్’ ద్వారా పిల్లల ఎదుగుదలను డిజిటల్‌గా పర్యవేక్షిస్తూ పారదర్శక పాలనకు తెరలేపారని కొనియాడారు.

చిన్నారుల్లో రక్తహీనత, ఎదుగుదల లోపాలను తరిమికొట్టేందుకు గుడ్లు, పాలు క్రమం తప్పకుండా ‘పోషణ్ అభియాన్’ నిర్వహిస్తున్నట్లు  సింగిరెడ్డి కృష్ణారెడ్డి తెలిపారు. ఏటా ‘పోషణ్ మాసం’ ద్వారా ప్రజల్లో విశేష చైతన్యం తెస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్ల సేవలు అభినందనీయమన్నారు. పీఎం మాతృవందన & సుమన్ స్కీములతో పేద గర్భిణులకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకే నగదు జమ (DBT) చేస్తున్నరని తెలిపారు. ‘సుమన్’ పథకంతో పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 100% ఉచిత, సురక్షిత ప్రసవాలు జరుగుతున్నాయని వివరించారు.

“గతంలో పథకాలు కాగితాలకే పరిమితమని.. మోడీ పాలనలో నేరుగా ప్రజల ముంగిటికి తెచ్చిన ఘనత మోడీ సర్కార్ దని కృష్ణారెడ్డి పేర్కొన్నారు. అంగన్‌వాడీలకు వెన్నుదన్నుగా నిలిచిన మోడీ నాయకత్వాన్ని ప్రతి ఒక్కరూ బలపరచాలని  పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు మొగిలి మహేష్, ప్రధాన కార్యదర్శి ఎడ్ల సురేష్, నాయకులు రాపెల్లి శ్రీనివాస్, దళిత మోర్చా మండల అధ్యక్షుడు (వార్డ్ సభ్యుడు) రాజు, సోషల్ మీడియా కన్వీనర్ గుండె వెంకటేష్, సింగసాని నరేష్, దామెర మధుసూదన్ రెడ్డిలతో పాటు అంగన్‌వాడీ కార్యకర్తలు నజిమ, సరోజన, ఎల్లమ్మ, కళావతి, ఆశా కార్యకర్తలు లలిత, శారద మరియు పెద్ద సంఖ్యలో స్థానిక మహిళలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>