సింగరేణి కాంట్రాక్టు కార్మికుల పిల్లలకు శుభవార్త

కలం, వెబ్ డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు, కార్మిక సంఘాల విజ్ఞప్తుల మేరకు సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలకు భారీ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. సింగరేణి వ్యాప్తంగా ఉన్న 12 ఏరియాల్లో పనిచేస్తున్న సుమారు 30 వేల మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికుల పిల్లలకు సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ పాఠశాలల్లో (Singareni Schools) పూర్తిస్థాయి ఉచిత విద్యను అందించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు తాజాగా సర్క్యూలర్ జారీ చేసింది.

కాగా, 5 జిల్లాల్లో విస్తరించి ఉన్న మొత్తం 9 సింగరేణి పాఠశాలల్లో ఇప్పటివరకు కేవలం శాశ్వత ఉద్యోగుల పిల్లలకు మాత్రమే ఉచిత విద్య అందేది. కాంట్రాక్టు కార్మికుల పిల్లల నుంచి నామమాత్రపు లేదా సాధారణ ట్యూషన్ ఫీజులు వసూలు చేసేవారు. అయితే తాజా నిర్ణయంతో ప్రస్తుతం ఈ బడుల్లో చదువుతున్న 400 మంది కాంట్రాక్టు కార్మికుల పిల్లలకు తక్షణమే ఫీజు మినహాయింపు లభించనుంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి కొత్తగా చేరే కాంట్రాక్టు కార్మికుల పిల్లలకు కూడా ఈ ఉచిత విద్య సదుపాయం వర్తిస్తుందని యాజమాన్యం స్పష్టం చేసింది.

ఈ పథకం కింద ప్రయోజనం పొందగోరే కార్మికులు తమ గుర్తింపు కార్డు (ఐడీ), కార్మికుడి, పిల్లల ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, మరియు ప్రభుత్వం జారీ చేసిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలను సంబంధిత హెచ్‌ఓడీ అందజేయాల్సి ఉంటుంది. అదనంగా, సింగరేణి ఆధ్వర్యంలో నడుస్తున్న పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలల్లో స్థానికులు, ప్రాజెక్టు నిర్వాసితుల పిల్లలకు 50 శాతం సీట్లను కేటాయిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సింగరేణి యాజమాన్యం తాజా నిర్ణయంపై కాంట్రాక్టు కార్మిక కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>