కడ్తాల్ హైవేపై రోడ్డు ప్రమాదం.. యువకుడికి తీవ్రగాయాలు

కలం, సోన్: సోన్ మండలం కడ్తాల్(Kadthal) గ్రామ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంజారా హిల్స్ ప్రాంతానికి చెందిన గుగ్లవత్ ప్రశాంత్ మంగళవారం ఉదయం ద్విచక్ర వాహనంపై నిజామాబాద్ వైపు వెళ్తుండగా కడ్తాల్ సమీపంలో లారీ ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ప్రశాంత్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అంబులెన్స్‌ లో చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తొలుత ఓ ప్రైవేటు ఆసుపత్రికి, అనంతరం హైదరాబాద్‌కు తరలించారు. ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>