కలం, వెబ్ డెస్క్ : పంజాబ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (BJP), శిరోమణి అకాలీదళ్ (SAD) (BJP Akali Dal) మధ్య పొత్తు ఖరారైంది. ఆరేళ్ల విరామం తర్వాత ఈ రెండు పాత మిత్రపక్షాలు మళ్లీ చేతులు కలిపాయి.
ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ పొత్తుపై అధికారిక ప్రకటన వెలువడింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ సమక్షంలో ఇరు పార్టీలు కలిసి ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించాయి.
గతంలో 1997, 2002, 2007 ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన బీజేపీ-అకాలీదళ్ కూటమి పంజాబ్‌లో మూడుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2020లో వ్యవసాయ చట్టాల వివాదంతో విడిపోయిన ఈ పార్టీలు, ఇప్పుడు రాష్ట్రంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (APP), కాంగ్రెస్ పార్టీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు మళ్లీ ఏకమయ్యాయి.

