సిద్దిపేటలో ఘోరం.. బాలింత కడుపులో కాటన్ మరిచిన డాక్టర్

క‌లం మెద‌క్ బ్యూరో: సిద్దిపేట (Siddipet) ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం ఓ బాలింత ప్రాణాలకు ముప్పు కలిగింది. గత నెల‌ 14న రామాయంపేట మండలం సూతారిపల్లి గ్రామం నుంచి నందిని అనే మహిళ సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి డెలివరీ కోసం కోసం వచ్చింది. ఆపరేషన్ సమయంలో రక్తస్రావం కాకుండా కాటన్ పెట్టి సర్జరీ చేశారు. ఆ తర్వాత కాట‌న్ తీయ‌కుండా డాక్టర్ సిందూరి మర్చిపోయింది. కాటన్ అలాగే ఉండిపోవడంతో బాధిత మహిళ తీవ్ర కడుపు నొప్పితో భాదపడింది. తీవ్ర కడుపునొప్పి భరించలేక రామాయంపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ స్కానింగ్ చేయ‌గా అసలు విషయం బయటపడింది. చివరకు ప్రైవేట్ డాక్టర్లు కాట‌న్ (Cotton) తొలగించారు.

బాధిత బంధువులు సిద్దిపేట ప్రభుత్వాస్పత్రి డాక్టర్లను నిలదీశారు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే త‌మ కూతురు క‌డ‌పునొప్పితో నరకయాతన అనుభవించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అప‌రేష‌న్ చేసిన డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపి, చర్యలు తీసుకుంటామని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>