బండి భగీరథ్ కేసు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) స్పష్టం చేశారు. ఈ మేరకు చిట్ చాట్ నిర్వహించి మాట్లాడారు. నిందితుడు పరారీలో ఉన్నప్పుడు కొన్ని కేసుల్లో ఆలస్యం అవుతుందని చెప్పారు. గడిచిన 25 రోజుల్లో హౌసింగ్, రెవెన్యూ శాఖల్లో అన్ని ఉమ్మడి జిల్లాల్లో వరుస సమావేశాలు నిర్వహించామన్నారు. కలెక్టర్లు, DFOలను పిలిచి మాట్లాడామని.. హైదరాబాద్ మినహా మిగితా జిల్లాల ఇందిరమ్మ ఇండ్లపై సమీక్ష నిర్వహించామన్నారు. 2 బీహెచ్ కే ఇళ్లు పట్టణాల్లో వివిధ దశల్లో ఆగిపోయి ఉన్నాయని తెలిపారు. ముందుగా అర్హులను ఎంపిక చేసి ఇళ్లు పూర్తి చేసి ఇవ్వాలని చూస్తున్నామని చెప్పారు. ఈ నెల చివరి వరకు అర్హులను గుర్తిస్తామని.. హౌసింగ్ టవర్స్ ఉన్న దగ్గర సొసైటీలు ఏర్పాటు చేసి పూర్తి చేస్తామని వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>