ముద్రగడకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు.. ఆదేశాలు జారీ!

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన సీనియర్ నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ సారథి ముద్రగడ పద్మనాభం (Mudragada) అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. రాజకీయ విభేదాలకు తావులేకుండా, ఆయన సుదీర్ఘ ప్రజాసేవను గౌరవిస్తూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఫోన్లో చర్చించి… అధికారులకు ఆదేశాలు జారీ

ఈ విషయంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోన్లో మాట్లాడుకున్నారు. ముద్రగడ ప్రస్తుతం ప్రతిపక్ష వైసీపీ సభ్యుడి అయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పోషించిన కీలక పాత్రను వారు ఈ సందర్భంగా స్మరించుకున్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేలగా, ఒకసారి ఎంపీగా, అలాగే రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా ఆయన ప్రజలకు అందించిన సేవలు వెలకట్టలేనివని నేతలిద్దరూ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే ఆయన గౌరవార్థం ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని నిర్ణయించారు. ఈ మేరకు తక్షణమే ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

మరోవైపు ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు జరగనున్న కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ఆయన నివాసం వద్ద కాసేపటి క్రితం హై టెన్షన్ వాతావరణం నెలకొంది. తన తండ్రి భౌతికకాయాన్ని చూసేందుకు వచ్చిన ఆయన కుమార్తె, జనసేన నాయకురాలు క్రాంతిని ముద్రగడ అనుచరులు అడ్డుకున్నారు. కాపు నేతలందరికీ నాయకుడు పవన్ కళ్యాణ్ అంటూ గతంలో క్రాంతి వ్యాఖ్యానించడంతో ముద్రగడ కుటుంబంతో ఆమెకు దూరం పెరిగింది. ఈ నేపథ్యంలోనే తాను చనిపోతే తన అంత్యక్రియలకు కూడా రావొద్దని ముద్రగడ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో “గో బ్యాక్ క్రాంతి” అంటూ ముద్రగడ అనుచరుల నినాదాలు చేశారు.

అయితే తీవ్ర ఉద్రిక్తతల నడుమ పోలీసుల సాయంతో తండ్రి భౌతికకాయం వద్దకు వెళ్లిన క్రాంతిని ముద్రగడ బంధువులు, అనుచరులు పార్థివ దేహం ఉన్న ఫ్రీజర్ బాక్స్ ను కూడా టచ్ చేయనివ్వలేదు. క్రాంతి ఆవేదనతో బోరున విలపించగా.. ఆమెను బయటకు పంపేయాలని ముద్రగడ భార్య డిమాండ్ చేశారు. ఇక పరిస్థితి అదుపుతప్పుతొందన్న అనుమానంతో క్రాంతిని పోలీసులు బయటకు తీసుకెళ్లారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>