Mobile Popup Ad
Mobile Popup Ad

జీతాలు పెంచాలంటూ ఆశా వర్కర్ల ర్యాలీ

కలం, మెదక్ బ్యూరో : గ్రామాల నుండి పట్టణాల వరకు ప్రజల ఆరోగ్య రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న ఆశా వర్కర్లకు నెలకు రూ.18,000 ఫిక్స్డ్ వేతనం ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం హామీ అమలు చేయాలని సిద్దిపేట (Siddipet)లో ఆశా వర్కర్లు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆశా వర్కర్లకు రూ. 18 వేలు జీతం ఇస్తామని హామీ ఇచ్చి దాదాపు 26 నెలలు గడిచినా, ఇప్పటికీ అమలు చేయకపోవడం పూర్తిగా ఆశా వర్కర్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లు కరోనా కాలం నుండి ఇప్పటి వరకు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలు అందిస్తున్నా, ప్రభుత్వం మాత్రం వారి కష్టాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బడ్జెట్ కేటాయించి, ఆశా వర్కర్లకు ఇచ్చిన రూ.18,000 వేతన హామీని తక్షణమే అమలు చేయాలని లేకపోతే, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆశ వర్కర్ జిల్లా (Siddipet) అధ్యక్షులు లక్ష్మీ, గౌరవాధ్యక్షులు మంచే నర్సింలు బిఆర్టియు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు పిండి అరవింద్ యాదవ్, బీడీ సంఘం జిల్లా అధ్యక్షులు శోభన్ , సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా అన్ని పిహెచ్సి ల నుంచి ఆశ వర్కర్ల పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>