కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా సిద్దరామయ్య (Siddaramaiah) నియామకం అయ్యారు. సిద్దరామయ్యను సీడబ్ల్యూసీ సభ్యుడిగా నియమిస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాలు జారీ చేశారు. కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొంటూ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులో పేర్కొన్నారు. రేపు డీకే శివకుమార్ తో పాటు కనీసం 12 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సిద్దరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

