కలం, స్పోర్ట్స్: భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) మరో అరుదైన ఘనత సాధించాడు. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. దీంతో వన్డేల్లో ఈ అవార్డును ఏడోసారి అందుకున్నాడు. ఈ క్రమంలో ఎంఎస్ ధోనీ, సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్ సరసన చేరాడు. వెస్టిండీస్‌తో సిరీస్‌లో గిల్ బ్యాట్‌తో దుమ్మురేపాడు. తొలి వన్డేలో 110 పరుగులు చేశాడు. రెండో మ్యాచ్‌లో అజేయంగా 223 పరుగులు బాదాడు. మూడో వన్డేలో మాత్రం ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. అయినా మూడు మ్యాచ్‌ల్లో కలిపి 334 పరుగులతో సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.
నాలుగేళ్లలోనే ఏడు అవార్డులు
గిల్ (Shubman Gill) సాధించిన ఏడు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులూ 2022 తర్వాతే వచ్చాయి. అంటే కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే ఈ ఘనత సాధించాడు. ఇదే ఈ రికార్డులో ప్రత్యేకత. భారత క్రికెటర్లలో ఈ సమయంలో గిల్ కంటే ఎక్కువగా ఈ అవార్డు అందుకున్న ఆటగాడు లేడు. వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు సచిన్ టెండూల్కర్ 15తో అగ్రస్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ 11తో తర్వాతి స్థానంలో ఉన్నాడు. గిల్, ధోనీ, గంగూలీ, యువరాజ్ ఏడేసి అవార్డులతో తర్వాతి స్థానంలో ఉన్నారు.
Also Read : గిల్ అరుదైన రికార్డ్.. దిగ్గజాల క్లబ్‌లోకి!
Follow Us On: X(Twitter)

