షాకింగ్ యాక్సిడెంట్: కార్ క్రాష్.. బైక్ ముక్కలైంది.. కానీ!

కలం, వెబ్ డెస్క్ : తమిళనాడులో షాకింగ్ రోడ్డు ప్రమాదం (Tamil Nadu Accident) జరిగింది. తూత్తుకుడి జిల్లా శాత్తాన్‌కుళం ప్రాంతంలో రోడ్డు పక్కన బైక్‌పై కూర్చుని ఒక యువకుడు ఫోన్ చూస్తున్నాడు. అదే సమయంలో వేగంగా దూసుకొచ్చిన ఒక కారు ఆ యువకుడి బైక్‌ను ఢీకొట్టి కొంతదూరం ఈడ్చుకెళ్లింది.

ఊహించని ఈ ప్రమాదంలో ఆ యువకుడు చిన్న గాయం కూడా కాకుండా తృటిలో సురక్షితంగా బయటపడటంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ భయానక ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇది ఏఐ వీడియో అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేయడం గమనార్హం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>