కలం, వెబ్ డెస్క్: ప్రజాస్వామ్యాన్ని రక్షించే వరకు పోరాటం ఆపే ప్రసక్తి లేదని కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) స్పష్టం చేసింది. ఆందోళనలు ఈ రోజు కూడా కొనసాగుతున్నాయని, సీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు, మరికొందరిపై దాడికి కూడా పాల్పడ్డారని పార్టీ అధికార ప్రతినిధి అషుతోశ్ రంకా (Ashutosh Ranka) తెలిపారు. “నలుగురు మాజీ సీఎంలు అర్వింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, మాణిక్ సర్కార్, పినరయి విజయన్‌కు మేం ధన్యవాదాలు చెబుతున్నాం. శనివారం రోజు మాతో పాటు రోడ్ల మీదకు ఆందోళన చేసి మాకు సంఘీభావం ప్రకటించారు. అలాగే దేశ వ్యాప్తంగా ఉద్యమించిన విద్యార్థులకు కూడా ధన్యవాదాలు. ఏఐఎస్ఎఫ్ నాయకులను అరెస్ట్ చేయడమే కాకుండా వారిపై భౌతిక దాడులు కూడా చేస్తున్నారు” అని ఆరోపించారు.
ఫోన్లు ఎందుకు సీజ్ చేశారు..?
పోలీసులు అక్రమంగా తమ ఫోన్లను సీజ్ చేశారని సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ (Saurav Das) విమర్శించారు. “మాకు ఎలాంటి మెమో జారీ చేయకుండానే ఫోన్లు లాక్కున్నారు. గత కొన్నేళ్లుగా చేస్తున్నట్లుగా మా ఫోన్లను హ్యాక్ చేశారనే అనుమానం కలుగుతోంది. అందులో ఏదైనా ప్రమాదకరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి.. భవిష్యత్తులో మరోసారి మమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు వీటిని సాక్ష్యాలుగా చూపుతారనే ఆందోళన కలుగుతోంది. మా ఫోన్లను ఏదో కుట్ర చేద్దామనే లాక్కున్నారనే విషయం మాకు అర్థమవుతోంది” అన్నారు.
Also Read : గోవా బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On : WhatsApp

