శేఖర్ మృతిపై బీఆర్‌ఎస్ ఫైర్ .. జహీరాబాద్ హైవేపై ధర్నా

కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం బిలాల్‌పూర్ (Bilalpur) గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శేఖర్ అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే పోలీసుల వేధింపులు, దెబ్బలు తాళలేకే శేఖర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో ఆగ్రహించిన శేఖర్ బంధువులు, బిలాల్‌పూర్ గ్రామస్థులు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు (MLA Manik Rao) ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి జహీరాబాద్ (Zaheerabad) జాతీయ రహదారిపై మృతదేహంతో బైఠాయించి ధర్నా నిర్వహించారు.

శేఖర్ మృతికి కారణమైన పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. రోడ్డుపై ధర్నా చేపట్టడంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో పరిస్థితి క్రమంగా సద్దుమణిగింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>