epaper
Monday, January 19, 2026
spot_img
epaper

శర్వానంద్ సినిమాకు థియేటర్స్ పెంపు

కలం, సినిమా : టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ (Sharwanand) నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ (Nari Nari Naduma Murari)  మూవీ  సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమాకు సరైన థియేటర్స్ లేవు అనే కంప్లైంట్ ఉంది. శర్వానంద్ మూవీ చూడాలని ప్రేక్షకులు అనుకున్నా తమ ప్రాంతంలో థియేటర్స్ ఇవ్వలేదనే టాక్ వినిపించింది. పండుగకు పెద్ద స్టార్స్ సినిమాలు రావడంతో పోటీ తీవ్రంగా ఉండి, నారీ నారీ నడుమ మురారి సినిమాకు కాస్త తక్కువ సంఖ్యలోనే థియేటర్స్ లభించాయి.

అయితే.. ఇప్పుడు వారం రోజులు గడిచిన నేపథ్యంలో మెల్లిగా థియేటర్స్ పెంచుకుంటూ వెళ్తున్నారు. నారీ నారీ నడుమ మురారి సినిమా థియేటర్స్ పెంచామని మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. మాజీ ప్రేయసి, ప్రేయసి మధ్య నలిగే యువకుడి కథతో దర్శకుడు రామ్ అబ్బరాజు (Ram Abbaraju) రూపొందించిన నారీ నారీ నడుమ మురారి సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా పేరు తెచ్చుకుంది. ఈ సినిమా చూసిన వారంతా బాగా నవ్వుకుంటున్నారు.

సామజవరగమన టీమ్ భాను, నందు రైటింగ్ ఈ సినిమాకు బలంగా మారింది. నారీ నారీ నడుమ మురారి హిట్‌తో చాలా గ్యాప్ తర్వాత నిర్మాత అనిల్ సుంకర (Anil Sunkara) కు సక్సెస్ వచ్చింది. మరోవైపు శర్వానంద్ కూడా ఈ సినిమా సక్సెస్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చెప్పి మరీ హిట్ కొట్టానంటూ ఇటీవల ఆయన సక్సెస్ మీట్‌లో చెప్పారు. ఇలాంటి ఎంటర్‌టైనర్స్ తనకు బాగా సెట్ అవుతాయని శర్వానంద్ మరోసారి ప్రూవ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>