ఘనంగా శాంతినికేతన్ మానసిక వికలాంగుల కేంద్ర వార్షికోత్సవం

కలం, నిర్మల్: జిల్లా (Nirmal) కేంద్రంలోని ప్రభుత్వ పెన్షనర్ల సంఘ భవనంలో శుక్రవారం శాంతినికేతన్ మానసిక వికలాంగుల కేంద్రం (Shanthiniketan Mental Disability Center) 15వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ శాసనసభాపక్ష నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, సీనియర్ సివిల్ జడ్జి రాధిక ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మానసిక వికలాంగుల కోసం ఇలాంటి కేంద్రాలను నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. సమాజంలో ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు సేవలు అందించడం గొప్ప బాధ్యత అని, వారి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో కూడా మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కేంద్రం నిర్వాహకులు జనార్దన్, డైరెక్టర్ చెనిగారపు చిన్నయ్య, అయిండ్ల సాత్విక్, గొజ్జ జనార్దన్, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>