కలం, జోగులాంబ గద్వాల: కేటిదొడ్డి మండలం గంగన్పల్లి గ్రామంలోని 132/33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ (Ganganapally Substation) లో ఎల్సీ తీసుకునే క్రమంలో విద్యుద్ఘాతానికి గురై లైన్ మెన్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది.
గంగన్ పల్లి సబ్‌స్టేషన్‌లో ఆర్టీజీఎన్ గ్రేడ్-2 ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న నజీర్ బుధవారం రాత్రి సబ్‌స్టేషన్‌లోని ట్రాన్స్ఫార్మర్ వద్ద ఎల్సీ (LC) తీసుకునే క్రమంలో ఐసోలేటర్లను ఓపెన్ చేస్తుండగా అకస్మాత్తుగా ఎర్త్ అయి విద్యుత్ ప్రసరించింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదాన్ని గమనించిన తోటి సిబ్బంది వెంటనే స్పందించి, చికిత్స నిమిత్తం ఆయనను కర్నూలు ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.

