రో-కోలను తెలివిగా వాడుకోవాలి: అఫ్రిది

భారత క్రికెట్ జట్టులో వెటరన్ ఆటగాళ్ల రోహిత్ శర్మ (Rohit Sharma), కోహ్లీ (Kohli) భవిష్యత్తుపై చర్చలు కొనసాగుతున్న వేళ పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది (Shahid Afridi) పెద్ద సంచలనం సృష్టించాడు. తాజాగా దక్షిణాఫ్రికా సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు చూపిన ఫామ్‌ను ప్రశంసిస్తూ, ఈ ఇద్దరినీ 2027 వన్డే ప్రపంచకప్ వరకు జట్టులో కొనసాగించాల్సిందే అని బలంగా అభిప్రాయపడ్డాడు.

అయితే అతని వ్యాఖ్యలు ఇక్కడితో ఆగలేదు. భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను నేరుగా టార్గెట్ చేస్తూ అఫ్రిది ఘాటు విమర్శలు గుప్పించాడు. భారత ప్రణాళికల్లో రోహిత్–విరాట్ కీలక పాత్ర పోషిస్తారని అంటూనే, వారిని పక్కన పెట్టే చర్యలు జట్టుకు నష్టం చేస్తాయని సూచించాడు. గత కొన్నేళ్లుగా అఫ్రిది–గంభీర్‌ల మధ్య ఉన్న పగ శారీరక దూరం అయినా మానేదేలేదు. ఈ నేపధ్యంలో గంభీర్ (Gautam Gambhir) కోచింగ్ స్టైల్‌పై వ్యాఖ్యలు మరింత హైలైట్ అయ్యాయి.

“గౌతమ్ తన పదవీకాలాన్ని ప్రారంభించిన తీరు చూస్తే, తానే చెప్పేదే సరైందని భావించాడు. కానీ కొంతకాలానికి అతడూ ఎల్లప్పుడు సరైందికాదని తేలింది,” అని అఫ్రిది (Shahid Afridi) తీవ్రంగా విమర్శించాడు. గంభీర్ సారథ్యంలో భారత్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్‌ను గెలిచినా, టెస్టుల్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా చేత పరాజయాలు చవిచూసిన విషయం తెలిసిందే.

Read Also: మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు.. వారికి మాత్రమే ఛాన్స్

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>