నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్!

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్ర పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న మొత్తం 1,534 పోస్టుల భర్తీకి సంబంధించి (AP Police Recruitment) అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 378 సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) పోస్టులతో పాటు 1,156 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి.

ఈ ఉద్యోగాలకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు డిసెంబర్ 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత ఎంపిక పరీక్షలను నిర్వహించేందుకు బోర్డు తేదీలను ఖరారు చేసింది. ఇందులో భాగంగా కానిస్టేబుల్ అభ్యర్థులకు జనవరి 31వ తేదీన ప్రిలిమినరీ రాత పరీక్ష జరగనుంది.

అలాగే, సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) అభ్యర్థులకు ఫిబ్రవరి 28వ తేదీన రాత పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఎస్ఐ పరీక్షలను ఒకే రోజు రెండు విడతల్లో, అంటే ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 పద్ధతిలో నిర్వహిస్తారు. పోలీస్ ఉద్యోగాల కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అభ్యర్థులు గడువు లోపు దరఖాస్తు చేసుకుని పరీక్షలకు సిద్ధం కావాలని అధికారులు సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>