చీరాలలో ఆంజనేయ స్వామి విగ్రహానికి నిప్పు!

కలం, వెబ్ డెస్క్ : బాపట్ల జిల్లా చీరాల పట్టణంలోని పేరాల శివాలయం సెంటర్‌లో దారుణం జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఆంజనేయ స్వామి (Chirala Anjaneya Swamy) విగ్రహానికి నిప్పు పెట్టారు. తెల్లవారుజామున ఆలయ పరిసరాల్లోని సీసీ కెమెరాను ధ్వంసం చేసిన అనంతరం నిందితులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న చీరాల టూ టౌన్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో విచారణ చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>