మత్స్యకారుల గల్లంతు.. ఏపీ ప్రభుత్వం అలర్ట్!

కలం, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా సుబ్బంపేట నుంచి సముద్రంలో వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ (Fishermen Missing) గల్లంతైంది. ఈ నెల 13వ తేదీ వరకు కుటుంబ సభ్యులకు ఫోన్‌లో టచ్‌లోనే ఉన్నారు. గత పది రోజులుగా వారి నుంచి ఎలాంటి ఫోన్ కాల్స్ రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. సముద్రంలో బోటు బోల్తా పడినట్లు సమాచారం అందడంతో వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో అలర్ట్ అయింది.

సీఎం చంద్రబాబుకు విషయం తెలియడంతో అధికారులతో మాట్లాడారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. కోస్ట్ గార్డ్, నేవీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ గాలించాలని సూచించారు. అలాగే పొరుగునే ఉన్న బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలకు కూడా సమాచారం అందించాలని.. అటు వైపు వెళ్లి ఉంటే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

క్షేమంగా వస్తారని..

మత్స్యకారుల గల్లంతుపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. చెన్నై తీరం వైపు అధికారులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నామని, వరుస తుఫాన్ల కారణంగా వేరే దేశాల తీరాల వైపు కొట్టుకునిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు వివరించారు. మత్స్యకారులు క్షేమంగా తిరిగి వస్తారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. తమవాళ్లు ఎక్కడున్నారు.. ఏం జరిగిందంటూ మత్స్యకారుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వీలైనంత త్వరగా తమవారి జాడ కనుక్కోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>