సేవాలాల్ ఆలయ శంకుస్థాపనకు తరలిరావాలి: బాలు నాయక్

కలం, దేవరకొండ: బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయం, విగ్రహ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి దేవరకొండ నియోజకవర్గం నుంచి సుమారు 10 వేల మంది తరలిరావాలని ఎమ్మెల్యే బాలు నాయక్ (MLA Balu Naik) పిలుపునిచ్చారు. ఈ నెల 26వ తేదీ గురువారం నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మద్దిమడుగులో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.

శంకుస్థాపన అనంతరం అచ్చంపేట నియోజకవర్గంలోని హాజీపూర్ వద్ద ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారని బాలు నాయక్ తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి దేవరకొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి 100 బస్సులతో పాటు సొంత వాహనాల్లోనూ ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు, బంజారా సోదరులందరూ సమన్వయంతో పనిచేసి ఈ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అన్ని మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా నాయకులు, యువజన కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>