భక్తిశ్రద్ధలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం

కలం, సోన్ : కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సోన్ మండలం సాకేర గ్రామంలోని శ్రీశ్రీశ్రీ శివ పంచాయతన రమాసహిత సత్యనారాయణ స్వామి, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మంగళవారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని (Satyanarayana Swamy Vratham) భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు, అర్చనలు చేపట్టారు.

అనంతరం భక్తులు సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. కార్తీక పౌర్ణమి సందర్బంగా మహిళలు ఆలయ ఆవరణలోని ఉసిరి చెట్టు వద్ద కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆమెడ కిషన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>