DHPS వార్షికోత్సవాలను విజయవంతం చేయాలి.. నాయకుల పిలుపు

కలం, కరీంనగర్: హైదరాబాద్‌లో ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించనున్న దళిత హక్కుల పోరాట సమితి (DHPS) 20వ వార్షికోత్సవాలను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కరీంనగర్‌లోని సీపీఐ పార్టీ కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో వార్షికోత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి DHPS జాతీయ కౌన్సిల్ సభ్యుడు బోయిని అశోక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా బోయిని అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి బోయిని తిరుపతి మాట్లాడుతూ.. నవంబర్ 29న హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో వార్షికోత్సవ సభ, 30న సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ప్రతినిధుల మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. కరీంనగర్ జిల్లాలోని అన్ని మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.

2006 అక్టోబర్ 22న విశాఖపట్నంలో అమరజీవి కామ్రేడ్ గుండా మల్లేష్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా DHPS ఆవిర్భవించిందని గుర్తుచేశారు. స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా దళితులు ఇంకా అనేక రంగాల్లో వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక సమానత్వం, న్యాయం, కుల నిర్మూలన లక్ష్యాలు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని విమర్శించారు.

ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని, దళితుల అభివృద్ధికి కేటాయించాల్సిన 15 శాతం నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న దళిత సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో DHPS ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని బోయిని అశోక్, బోయిని తిరుపతి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గంగిపల్లి శంకర్, DHPS నాయకులు రాజకుమార్, మురళి, యుగంధర్, రవి, తదితరులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>