నకిలీ రూ.500 నోట్ల తయారీ ముఠా అరెస్టు

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : పెద్ద మొత్తంలో నకిలీ రూ.500 నోట్లు (Fake Notes) తయారు చేస్తున్న ముఠాను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపుతున్నట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. బిజినపల్లి మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ అశోక్ రెడ్డి, ఎస్ఐ శంషోద్దీన్ తో కలిసి నకిలీ నోట్ల తయారీ ముఠాకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

మండలంలోని మంగనూర్ లోని కనకదుర్గ వైన్స్ లో నిందితులు అగస్టు 1న రెండు నకిలీ రూ.500 నోట్లు ఇచ్చి బీర్లు కొనుగోలు చేశారు. వైన్స్ షాపులో పనిచేసే క్యాషియర్ రాగి స్వామి క్యాష్ కౌంటింగ్ మిషన్లో నోట్లను లెక్కిస్తుండగా రెండు నోట్లు నకిలీ అని గుర్తించి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ శంషోద్దీన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో బిజినేపల్లి మండలంలోని మంగనూర్ గ్రామానికి చెందిన బొల్ల కురుమూర్తి ఇంట్లో నకిలీ నోట్లను తయారు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం రావడంతో నాగర్ కర్నూల్ సీఐ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో దాడి చేసి ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

పట్టుబడిన వారిలో ఏ1 నాగరాజు, ఏ2 శివ వెంకట ధర్మరాజు, ఏ3 అశోక్ కుమార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని పశ్చిమ గోదావారి జిల్లాకు చెందిన వారు కాగా, ఏ4 ఎల్ఎన్. సతీష్ కుమార్, ఏ7 అడపా పృధ్వీరాజ్లు. అంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాకు చెందిన వారు, ఏ5 వంగ నవీన్ గౌడ్, ఏ6 బొల్ల కురుమూర్తిలు బిజినేపల్లి మండలం, మంగనూర్ గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణ జిల్లాకు చెందిన ఏ8 జయమంగళ సత్యనారాయణ అనే నిందితుడు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ వెల్లడించారు. వీరి నుంచి రూ.68 వేల విలువైన నకిలీ నోట్లను, నోట్ల తయారీకి వినియోగించే పేపర్లు, క్యాష్ కౌంటింగ్, మిషన్, కలర్ ప్రింటర్, 7 సెల్‌ఫోన్లు రూ.68 వేల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

పరారీలో ఉన్న నిందితుడు సత్యనారాయణను తొందరలోనే అదుపులోకి తీసుకుంటామన్నారు. వీరిపై చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. నకిలీ నోట్ల తయారీ ముఠా గుట్టు రట్టు చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ అశోక్ రెడ్డి, ఎస్ఐ శంషోద్దీన్, సిబ్బంది భీముడు, ప్రవీణ్, రమేష్, శివలను డీఎఎస్పీ అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>