కలం, వెబ్ డెస్క్: ఫ్లై దుబాయ్ విమాన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కో-పైలట్ (Flydubai Co-Pilot) హమామ్ అల్-హమామిగా గుర్తించారు. ఈనేపథ్యం పై సంచలన వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒమన్‌కు చెందిన హమామీ గతంలో ఒమన్ ఎయిర్‌లో పనిచేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
అక్కడ శిక్షణ పొందుతున్న సమయంలో ఆయన కార్యకలాపాలపై భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తమైనట్లు సమాచారం. దీంతో 2024లో విమాన శిక్షణ నుంచి తప్పించి మరో బాధ్యత అప్పగించినట్లు పలు నివేదికలు వెల్లడించాయి.
సోషల్ మీడియా పోస్టులపై దర్యాప్తు
హమామీకి సంబంధించినట్లు చెబుతున్న తొలగించిన సోషల్ మీడియా ఖాతాల్లో అల్‌ఖైదా మాజీ నేత అయ్మన్ అల్ జవాహిరి తదితర వ్యక్తుల ఫొటోలు కనిపించినట్లు సమాచారం. అలాగే ఇజ్రాయెల్‌కు చెందిన ఎల్‌అల్ విమానాలకు సంబంధించిన వీడియోలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ పోస్టులను ఎవరు అప్‌లోడ్ చేశారనే విషయం, వాటి ఉద్దేశం ఏమిటన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఈ వివరాలను అధికారిక దర్యాప్తు సంస్థలు పూర్తిగా ధృవీకరించాల్సి ఉంది.
కాగా, ఒమన్ ఎయిర్ తర్వాత హమామీ రాయల్ ఎయిర్ మారోక్‌తోనూ సంబంధం కలిగి ఉన్నట్లు తెలుస్తుంది. 2025లో అక్కడ చేరి 2026 జనవరిలో వైదొలిగినట్లు సమాచారం. అనంతరం ఫ్లై దుబాయ్‌లో సుమారు ఎనిమిది నెలలుగా పనిచేస్తున్నట్లు దర్యాప్తు వర్గాలను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఈ ఘటనకు దారితీసిన కారణాలు, హమామీ గత కార్యకలాపాలు, భద్రతా తనిఖీలకు సంబంధించిన అంశాలపై పలు దర్యాప్తు సంస్థలు విచారణ కొనసాగిస్తున్నాయి.

