కలం, వెబ్ డెస్క్ : విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరి పేటలో ఒక దారుణ సంఘటన చోటుచేసుకుంది. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న మహాలక్ష్మి, చిన్నారావుల మధ్య అనుమానం పెనుభూతంగా మారింది. ప్రియురాలు మహాలక్ష్మిపై అనుమానంతో కక్ష పెంచుకున్న చిన్నారావు కొడవలితో ఆమె మెడపై దాడి (Vijayawada Attack) చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మహాలక్ష్మిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతోంది.
ఈ ఘాతుకానికి ఒడిగట్టిన అనంతరం చిన్నారావు భవనం డాబాపైకి వెళ్లి, అక్కడి నుంచి కిందకు దూకేశాడు. తీవ్రగాయాలపాలైన చిన్నారావును కూడా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

