కలం, వెబ్ డెస్క్ : న్యాయ సేవలను సామాన్య ప్రజల వద్దకే చేరవేసే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ( TSLSA) ఆధ్వర్యంలో రూపొందించిన ‘సంచార లోక్ అదాలత్’ (Mobile Lok Adalat) ప్రత్యేక వాహనాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. గ్రామీణ, దూర ప్రాంతాల ప్రజలకు ఉచితంగా, వేగవంతంగా న్యాయ సేవలు అందించడానికి ఈ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. కోర్టుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సివిల్, కాంప్రమైజ్ చేయదగిన క్రిమినల్ వివాదాలను రాజీ మార్గంలో పరిష్కరించుకోవడానికి ఇవి ఉపయోగపడనున్నాయి.
ఈ కార్యక్రమంలో కేంద్ర చట్ట, న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి.మోహన్, జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఆర్.మహాదేవన్, జస్టిస్ విక్రమ్ నాథ్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. న్యాయవ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయడంలో TSLSA చేపట్టిన ఈ చొరవను పలువురు ప్రశంసించారు.

