కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని పంచగామ గ్రామంలో సంచలన ఘటన వెలుగుచూసింది. స్థానిక విఠలేశ్వర ఆలయ పరిసరాల్లో గుట్టుచప్పుడు కాకుండా చేస్తున్న గంజాయి సాగు (Ganja Cultivation)ను ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన అధికారులు, పెద్ద ఎత్తున గంజాయి మొక్కలను చూసి షాక్‌కు గురయ్యారు.
ఈ దాడుల్లో భాగంగా సుమారు 600 గంజాయి మొక్కలను పోలీసులు ధ్వంసం చేశారు. అలాగే నిందితుల నుంచి 15 కిలోల ఎండు గంజాయిని, లక్ష రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ అక్రమ సాగు వెనుక ఒక స్వామీజీ హస్తం ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఎక్సైజ్ పోలీసులు ఈ కేసును రహస్యంగా విచారిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో గంజాయి సాగు (Ganja Cultivation) స్థానికంగా కలకలం రేపుతోంది.
Read Also: మేడారం వెళ్తున్నారా.. ఇవి కచ్చితంగా తెలుసుకోండి..
Follow Us On : WhatsApp


