కేసీఆర్‌ అనుభవం అసెంబ్లీకి అవసరం: శ్రీధర్‌బాబు

కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ (KCR) బడ్జెట్ సమావేశాలకు రావాలని కోరుతున్నామని.. ఆయన అనుభవం అవసరమని ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు (Sridhar Babu) అభిప్రాయపడ్డారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ విషయంలో స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అని  అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి విషయంలో పార్టీ ఎప్పడు నిర్లక్ష్యం వహించలేదని చెప్పారు. స్థానికంగా ఎదురవుతున్న సమస్యలు జీవన్ రెడ్డికి (Jeevan Reddy) ఇబ్బందులు కలిగిస్తున్నాయని తెలిపారు. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై శ్వేత పత్రం విడుదల చేస్తామని మంత్రి ప్రకటించారు.

డీసీసీ అధ్యక్షులు అంతా కాంగ్రెస్ నాయకులేనని.. ఒకరిద్దరు మాత్రమే కొత్తవారు ఉన్నారని చెప్పారు. వంశీచంద్ రెడ్డి కోఆర్డినేషన్ కమిటీలో ఉంటే తప్పేముంది? అని ప్రశ్నించారు. మంత్రుల మార్పులు చేర్పులు విషయంలో సీఎం రేవంత్ రెడ్డికే పూర్తి స్వేచ్ఛ ఉంటుందని వ్యాఖ్యానించారు. ప్రతి సంవత్సరం ఐటీ ఎగుమతులు వివరాలు ప్రతి ఆరు నెలలకు ఒకసారి కేంద్రం ఇస్తోందన్నారు. కేటీఆర్ (KTR) పాత వివరాలు చెప్పారని.. తమ అధికారులు గవర్నర్ ప్రసంగంలో లేటెస్ట్ డేటా పెట్టారని క్లారిటీ ఇచ్చారు. బ్యాంకు లింకేజ్ ద్వారా రూ. 57 వేల కోట్లను మహిళలకు రుణాలు ఇచ్చినట్లు తమ డీసీఎం చెప్పారని అన్నారు.

సింగరేణిపై ప్రభుత్వంతో పాటు కేంద్రానికీ బాధ్యత..

సింగరేణి (Singareni) సంస్థ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రానికీ కూడా బాధ్యత ఉందని మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) వ్యాఖ్యానించారు. బొగ్గు విషయంలో తక్కువ వచ్చే చోట కొంటారని చెప్పారు. సింగరేణి కార్మికుల భద్రత ప్రధానమని.. ఈ విషయాన్ని కిషన్ రెడ్డితో చర్చిస్తామని చెప్పారు. సింగరేణి బొగ్గు విషయంలో ఒప్పందం ఉంటుందని.. దానిని కాదని వెళ్లడం సాధ్యం కాదని చెప్పారు. సింగరేణి విషయంలో ఐదారు జిల్లాలకు ప్రజలకు ఉపాధి పోకుండా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని హితవు పలికారు. ఈ రెండేండ్లలో తాము సింగరేణిని అప్పుల్లోకి నెట్టలేదన్నారు. సింగరేణిని కాపాడడమే తమ ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. బకాయిలు అనేవి ప్రభుత్వం క్రమంగా విడుదల చేస్తుంటాయని చెప్పారు. జిల్లాల పునర్విభజన ఇప్పట్లో జరగదని చెప్పారు.

కేటీఆర్ సిక్స్ లు కొడుతుండేది సోషల్ మీడియాలో మాత్రమేనని.. తాము ప్రజా క్షేత్రంలో సిక్స్ లు కొడుతున్నామని శ్రీధర్ బాబు చమత్కరించారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ మారకుంటే తరువాతి ఎన్నికల్లో అసెంబ్లీకి రాలేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాళ్ల సభ్యులపై వాళ్ళకే నమ్మకం లేదని.. అందుకే రాజ్య సభకు బీఆర్ఎస్ పోటీ పెట్టలేదన్నారు. అమెరికా, ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం వల్ల పరిశ్రమలపై ప్రభావం ఉంటుందన్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రంతో మాట్లాడారని చెప్పారు. అవకాశం ఉన్నంత వరకు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు.

Read Also: వెలుగుమట్ల బాధితులందరికీ నిజ నిర్ధారణ కమిటీతోనే న్యాయం: కవిత

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>