సీదిరి అప్ప‌ల‌రాజుకు బెయిల్ మంజూరు!

క‌లం, వెబ్‌డెస్క్‌: రోడ్డు ప్రమాదం కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు (Seediri Appalaraju)కు నేడు బెయిల్ లభించింది. 23 రోజులుగా సీదిరి అప్పల రాజు శ్రీకాకుళం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అప్ప‌ల‌రాజు కుమారుడు ఆర‌వ్ వ‌ర్మ‌ చేసిన యాక్సిడెంట్‌కు సంబంధించి ఆధారాలు తారుమారు చేశార‌నే ఫిర్యాదుతో పోలీసులు ఆయ‌న‌ను అరెస్ట్ చేశారు. అంత‌కుముందు అప్ప‌ల‌రాజు కుమారుడిని సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. అనంత‌రం బెయిల్‌పై విడుద‌ల చేశారు. తాజాగా అప్ప‌ల‌రాజుకు సోంపేట జిల్లా అడిష‌న‌ల్ జిల్లా కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఈ రోజు రాత్రి లోపు ఆయ‌న జైలు నుంచి విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>